బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 మే 2021 (10:29 IST)

మళ్లీ 2లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు, మరణాల్లో పెరుగుదల కనిపించింది. తాజాగా 2.08లక్షల మందికి కరోనా సోకగా..నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మొదటిసారి 22లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. 24 గంటల వ్యవధిలో 22,17,320 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,08,921 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 40 రోజుల తరవాత రెండు లక్షల దిగువకు చేరిన కేసులు..తాజాగా మరోసారి ఆ మార్కును దాటాయి. రోజూవారీ మరణాల్లో పెరుగుదల కనిపించింది.

4,157 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 2,71,57,795 మందికి కరోనా సోకగా..3,11,388 మంది ప్రాణాలు వదిలారు.కరోనా ఉద్ధృతి కాస్త అదుపులో ఉండటంతో..క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

ప్రస్తుతం 24,95,591మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 9.60 శాతానికి చేరింది. నిన్న 2,95,955 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. వరసగా 13వ రోజు కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా 2.43 కోట్ల మందికిపైగా మహమ్మారి నుంచి బయటపడగా..రికవరీ రేటు 89.26 శాతానికి చేరింది.