శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 15 మే 2021 (13:44 IST)

corona: కాస్త తగ్గిన కరోనా కేసులు, మరణాలు: దేశంలో 36 లక్షల యాక్టివ్ కేసులు

దిల్లీ: కరోనా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ..ఉద్ధృతి మాత్రం కొనసాగుతోంది. తాజాగా 16,93,093 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,26,098 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరసగా రెండోరోజు కూడా కొత్త కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 3,890 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 2.43కోట్ల మందికి వైరస్ సోకగా.. 2,66,207 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
అయితే క్రితం రోజుతో పోల్చుకుంటే క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. ఈ గణాంకాలు ఒకింత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం 36,73,802 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,53,299 మంది కోలుకున్నారు. క్రియాశీల రేటు 15.41 శాతానికి చేరగా..రికవరీ రేటు 83.50 శాతంగా ఉంది.