మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 27 అక్టోబరు 2016 (17:15 IST)

మావోయిస్ట్ మృతుల సంఖ్య 30... ఆర్కె, విజ‌య్‌లు పోలీసుల అదుపులో ఉన్నారా...?

హైద‌రాబాదు: మ‌ల్కాన్‌గిరి చిత్రకొండ ఇపుడు యుద్ధ భూమిలా మారింది. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఇక్క‌డ పోలీసుల కూంబింగ్ ముమ్మ‌రంగా సాగుతోంది. మొన్న పోలీస్ ఎన్‌కౌంట‌ర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెంద‌గా, ఈ రోజు తాజాగా మ‌రో ఇద్ద‌రు ఎన్‌కౌంట‌ర్ అయ

హైద‌రాబాదు: మ‌ల్కాన్‌గిరి చిత్రకొండ ఇపుడు యుద్ధ భూమిలా మారింది. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఇక్క‌డ పోలీసుల కూంబింగ్ ముమ్మ‌రంగా సాగుతోంది. మొన్న పోలీస్ ఎన్‌కౌంట‌ర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెంద‌గా, ఈ రోజు తాజాగా మ‌రో ఇద్ద‌రు ఎన్‌కౌంట‌ర్ అయ్యారు. దీనితో మ‌ల్కాన్‌గిరి ప్రాంతం మ‌రింత ఉద్రిక్తంగా మారింది. 
 
ఏఓబిలో భారీ ఎన్‌కౌంట‌ర్ అనంత‌రం కూంబిగ్ పేరుతో ఏపీ ప్ర‌భుత్వం తీవ్ర‌మైన అల‌జ‌డి సృష్టిస్తోంద‌ని విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు ఆరోపించారు. పీపుల్స్ వార్ అగ్ర‌నేత‌ల‌ను పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని, ఆర్కే, విజ‌య్‌లు ఇపుడు పోలీసుల చేతిలో బందీలుగా ఉన్నార‌ని ఆరోపించారు. వారిని వెంట‌నే కోర్టుకు హాజ‌రు ప‌ర‌చాల‌ని పౌర‌హ‌క్కుల సంఘం నేత‌లు, విర‌సం నేత‌లు డిమాండు చేశారు.