గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (09:10 IST)

ఉపాధ్యాయురాలిగా మారిన రోజా

చిత్తూరు జిల్లాలో నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా సర్వహంగులతో రూపుదిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు.

విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. అత్తూరులో నాడు - నేడు కింద ఆధునికీకరించిన జెడ్‌పి హై స్కూల్‌ భవనాన్ని, కేఆర్‌పాళెంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అత్తూరు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మారి పాఠాలు బోధించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో భూమి మనం అనే పాఠ్యాంశంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.