సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుంది: పవన్‌పై రోజా ఫైర్
ఏపీ మంత్రి రోజా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌ను శృంగార తార, బాలీవుడ్ భామ సన్నీ లియోన్‌తో పోల్చారు. పవన్ సంస్కారం గురించి మాట్లాడుతుంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సంస్కారం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని తెలిపారు.
పవన్ ఎవరి మాటా వినడని, అందుకే భార్యలు కూడా వదిలేశారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక పనికిమాలిన వ్యక్తి అని, కరోనా సంక్షోభం సమయంలో హైదరాబాద్‌లో దాక్కున్నాడని ఘాటుగా విమర్శించారు.
ఎంతసేపూ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును చదవడమే పవన్ పని అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ రెచ్చిపోతున్నాడని సెటైర్లు విసిరారు.