మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:38 IST)

స్పీకర్ చాంబర్లో జరిగింది కేసీఆర్‌కు తెలియదు : ఎస్.జైపాల్ రెడ్డి

రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్ చాంబర్లో జరిగిన విషయాలు తనకేం తెలియవని కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. విభజన కథ మొత్తం జైపాల్ రెడ్డి నడిపించారనీ, లైవ్ టెలిక

రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్ చాంబర్లో జరిగిన విషయాలు తనకేం తెలియవని కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. విభజన కథ మొత్తం జైపాల్ రెడ్డి నడిపించారనీ, లైవ్ టెలికాస్ట్ ఆపేశారనీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఎస్.జైపాల్ రెడ్డి స్పందించారు. 'స్పీకర్‌ చాంబర్లో జరిగిన విషయాలు ఏవీ కేసీఆర్‌కు తెలియదు. ఉద్యమంలో ఆయన అద్వితీయ పాత్ర పోషించారు. కానీ, పార్లమెంటులో ఆయనకు పాత్ర లేదు. ఒక్కడే సభ్యుడు. ఏం జరుగుతుందో ఆయనకూ తెలియదు. లోక్‌సభకు అమాయకంగా 2 గంటలకు వచ్చి కూర్చున్నాడు. అంతే తప్ప చాంబర్లో ఏం జరిగిందో తెలియదు. మా మంత్రులకే తెలియదన్నారు. 
 
అయితే, స్పీకర్‌ చాంబర్లో మార్పులు చేయించింది మాత్రం తానేనని చెప్పారు. అలాగే, రాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడని నేను అనలేదు. అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే ప్రసక్తి ఉత్పన్నం కాలేదు. తెలంగాణ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యాం. తెలంగాణకు మా రుణం చెల్లించుకునే ప్రయత్నంలో భాగంగానే చేశాం. తప్ప, ఎవరు ముఖ్యమంత్రనే భావనతో చేయలేదు' అని జైపాల్‌రెడ్డి చెప్పారు.