1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (22:55 IST)

సజ్జల సూక్తి ముక్తావళి

ప్రతిపక్ష నేతలను నిత్యం బండబూతులు తిట్టే మంత్రులను వెనుకేసుకుని తిరిగే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సూక్తి ముక్తావళిని ప్రవచించారు. మీడియా ఎలా వుండాలో, బూతులంటే ఏంటో చెప్పారు. తమ పార్టీ నేతలు అసలు దూషణలే చేయరని, అలా ఎవరైనా చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా ముక్తాయించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
1-  నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు చేస్తున్న మా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అభినందనలు. ఈ సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా రెండు అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలు, ఎత్తుగడలు, వ్యూహాలు కొద్దిసేపు పక్కనపెడితే, మనిషి అన్నవాడికి ఎవరికైనా కనీస సంస్కారం ఉండాలా.. వద్దా.. అనే ప్రశ్న అందిరిలో ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం కావాలి.
 
2- సుదీర్ఘమైన 40 ఏళ్ళ పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పార్టీ.. ఒక మాట మాట్లాడినా, ఒక నిర్ణయం తీసుకున్నా ఒక విలువ ఉండాలి. ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 25 ఏళ్ళపాటు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన,  ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని న్యాయపరంగా కూడా కుట్రలు చేసి, దుర్మార్గంగా కబ్జా చేశాడు. అయితే, అప్పట్లో ఇన్ని టీవీ ఛానళ్ళు, మీడియా లేదు కాబట్టి, ఈనాడు పత్రిక ఏం రాస్తే, అదే నిజం అని ప్రచారం చేసేవారు. ఈనాడు లాంటి ప్రధాన పత్రికలు ఆరోజుల్లో ఏం రాస్తే.. అదే చరిత్ర అయ్యేది.  మొత్తం చరిత్రనే మార్చేసి, వారు ఏం చెబితే దానినిబట్టే చరిత్ర ఉంటుందని టీడీపీని చూస్తే అర్థమవుతుంది. 
 
3- చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాన్ని చూశాక,  ఇలాంటి అల్లుడు, ఇలాంటి మనిషి భూమ్మీద ఉండటానికి కూడా అనర్హుడు అని నాడు ఎన్నీఆర్ చెప్పారు. మళ్ళీ ఈరోజు అదే రామారావు గారి ఫోటోలకు దండ వేసి, ఆయనే మాకు స్ఫూర్తి అని బాబు అనగలుగుతన్నాడంటే.. ఇటువంటి మనిషిని, ఈ రాష్ట్రం భరిస్తుందంటే.. దౌర్భాగ్యమే. 
 
4- చంద్రబాబు స్క్రిప్టుతో ఆయన అధికార ప్రతినిధి చేత ప్రెస్ మీట్ పెట్టించి, వాళ్ళంతట వాళ్ళు వండిన గంజాయి కథను తెరమీదకు తీసుకొచ్చి, ఫలానావాళ్ళు గంజాయి వ్యాపారం చేస్తున్నారని, నక్కా ఆనందబాబుతో మాట్లాడించి, ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని, ఆయనకు పోలీసులు నోటీసులు ఇస్తే.. దానికి ఊగిపోతూ ముఖ్యమంత్రిగారిని అడ్డగోలుగా ఒరేయ్.. తురేయ్ తోపాటు దద్దమ్మ, చవట అని, మాట్లాడకూడని వేరే బూతు పదం మాట్లాడించి రెచ్చగొట్టేలా చేశారు. - ఆ పదం మేం చెప్పకపోతే.. మళ్ళీ వేరే విధంగా వీళ్ళు రాజకీయం చేస్తారు. అందుకే చెప్పాల్సి వస్తుంది. మహిళల్ని, తల్లుల్ని అవమానించే విధంగా బోషిడీకే అనే పదాన్ని ఒకసారి కాదు నాలుగు సార్లు అనిపించారు. అసలు ఆ మాట ఏం ఆశించి అన్నాడు, ఎందుకంత కోపం..?
 
5- సహజంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న, మహానాయకుడిగా ఎదిగిన జగన్ గారి మీద అభిమానం పెంచుకున్న వారు, ఎక్కడైతే బూతులు మాట్లాడారో..  అక్కడికే, ఆ పార్టీ కార్యాలయం దగ్గరకే  కొంతమంది మా పార్టీ అభిమానులు వెళ్ళారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందనేది పక్కకు తోసేసి, దాడి జరిగింది.. ఘోరం.. జరిగిందని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు రంకెలు వేస్తూ, ఊగిపోతూ రెండురోజులుగా మాట్లాడుతున్నాడు. 
- చంద్రబాబు అయితే,  రాష్ట్రంలో అర్జెంటుగా ఆర్టికల్ 356 పెట్టాలని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాడు. కానీ, అసలు జరిగింది ఏమిటి, ఆయన ఎందుకోసం దీక్ష చేస్తున్నారు అన్నది కనీస స్పృహ లేకుండా, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు..  ఆ బూతు పదం గురించి ఇంతవరకూ ప్రస్తావించడం లేదు.
 
6- రాజకీయాల్లో అలాంటి పదజాలం ఉపయోగించడం పొరపాటు, అలా అనకుండా ఉండాల్సిందని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆశిస్తున్నారు. 74 ఏళ్ళ వయసులో, భార్య, మనమడు ఉన్న ఆయన ఇంట్లో కూడా,  ఆ మాట వినాలంటే, మహిళలు ఇబ్బంది పడతారు.  
- అలాంటి బూతు పదాలు మాట్లాడించిన దాన్ని ఆయన దేవాలయం అంటాడు. దేవాలయం అయితే చెండాలం మాట్లాడిన అతన్ని చెప్పు తీసుకుని కొట్టాలి కదా.. అది అనుకోకుండానో, యథాలాపంగానో మాట్లాడిన మాట కూడా కాదు. కచ్చితంగా ఆ పదం చెప్పాలి అని చెప్పింది. అధికార ప్రతినిధులు మాట్లాడిన ప్రతి మాటను, పార్టీ అధ్యక్షుడు ఓన్ చేసుకోవాల్సిందే. 
 
7- ఒక బూతు మాట మాట్లాడినందుకు, రాజ్యాంగం మాకు ఈ విధమైన హక్కు కల్పించింది, దాని మీద ఉద్యమం నిర్మించాలి, 36 గంటలు దీక్ష చేయాలి, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి రాజకీయం చేయాలి, అమిత్ షాను కలవాలి.. అని సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇంకా నిన్నా, ఈరోజు దీక్షలు ఆ పార్టీ నాయకులు కొందరు మాట్లాడుతూ.. మీరు ఊ అంటే.. నరికేసి వస్తాం.. వదలండి సార్ అని మాట్లాడుతున్నారు. 
- ఆ బూతు మాట ఎవరు మాట్లాడినా.. తక్షణమే చెబ్బుతో కొట్టాల్సిన మాట. అలా కొట్టకపోతే.. వారు చీము, నెత్తురు ఉన్న మనిషే కాదు. 
 
8- రాజ్యాంగపరంగా ఈ రాష్ట్రానికి హెడ్ గా ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకుని, ఇటువైపు నుంచి ఎవరూ రెచ్చగొట్టకుండా, ఒకటికి నాలుగుసార్లు ఆ మాట మాట్లాడించారంటే.. పొరపాటు అని చెప్పకుండా, మనం అధికారంలోకి రాగానే.. అందర్నీ నరికేస్తాం.. కొట్టేస్తాం.. అని ఇంకా మాట్లాడటానికి టీడీపీ నేతలకు సిగ్గు ఎక్కడ లేదు. వారి పోకడలు చూస్తుంటే..  వారికి తక్షణం గొడవలు కావాలి. అందర్నీ కొట్టాలి. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ప్రదర్శన చేయాలి, తద్వారా రాజకీయం చేయాలి. ఎంతకాలం ఇలా చంద్రబాబూ..?
 
9- సాధారణ ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉన్నాయి. రాష్ట్రపతి పాలన అడగటం ఏంటి.. ? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అని దుష్ప్రచారం చేస్తే రాష్ట్రపతి పాలన ఎక్కడైనా ఉంటుందా..? 
- ఒక బాధ్యత కలిగిన పదవిలో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టమని అడగడడమా..? 
- అధికారం లేకపోతే మేము బతకలేము, ఉండలేకపోతున్నాము అన్నట్టుగా టీడీపీ నేతలు, చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వారికి పక్కన డప్పులు కొట్టేవారులా ఈనాడు- ఆంధ్రజ్యోతి తయారయ్యాయి. 
- మా వైపు నుంచి అన్నీ మంచి పనులు తప్ప.. ఎక్కడా ప్రజల్లో విమర్శలు లేవు. ముఖ్యమంత్రి జగన్ గారు బ్రహ్మాండమైన పథకాలు తెస్తున్నారు. ఆ పథకాలు చూసి తలలు పండిన రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను మార్చాలని చూస్తున్నారు. ప్రజలకు అధికారం ఇవ్వాలని చూస్తున్నారు. రాజకీయ పార్టీలకు అధికారం అన్నది దర్పం కాదు.. సేవ అని నిరూపిస్తున్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వం అని ఆచరణలో రుజువు చేసుకుంటున్నారు.
 
10- ఓ మంచి కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటారో.. అలానే 50 ఏళ్ళు కూడా లేని నాయకుడు..  70 ఏళ్ళ వ్యక్తిలా గొప్పగా వ్యవహరిస్తుంటే.. 70 ఏళ్ళ వ్యక్తి బాధ్యత లేని తుంటరి యువకుడిలా, ఒక తాగుబోతులా వ్యవహరిస్తున్నాడు. 
 
11- ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా,  ఆయన ఆ మాట చెప్పుకోవాల్సిన పరిస్థితి చూస్తే.. గుండె తరుక్కుపోతుంది. ఎవర్ని ఆ మాట అన్నా వెంటనే కొడతారు. ముఖ్యమంత్రిగా ఉండి తిట్టించుకోవడానికా అని రాష్ట్రం మొత్తం ఈరోజు ఫీలవుతున్నారు. 
 
12- రాజకీయ పదకోశంలో ఇటువంటి పదాలను పెట్టుకోవాలా.. లేక అలా మాట్లాడిన వారిని సాంఘీక బహిష్కరణ చేయాలా.. అన్నది తేలాలి. ప్రజల్లో చర్చ జరగాలి. 
- పైగా ఆ పదానికి టీడీపీ నేతలు కొత్త కొత్త భాష్యాలు చెబుతున్నారు. బోషిడీకే అంటే బాగున్నారా.. అని మాట్లాడుతున్నారు.  రేపు ఢిల్లీ వెళతాం అంటున్నారు, ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షాను కలిసి.. బోషిడీకే అని అంటారా..? ప్రధానిని ఆ మాట అనగలరా..? ఇంట్లో కూడా మీ కొడుకుని  అదే అంటారా.. ?
 
13- కాలం మారింది,  ఇలాంటి భాష మాట్లాడుకోవచ్చని మీరు అనుకుంటే.. దీన్నే ప్రజలను అడుగుదాం. ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే.. ముఖ్యమంత్రి గారు చెప్పుకోలేక చెప్పిన మాటను వారు కూడా ఎందుకు రాయలేకపోయారు..?  ఈనాడు పత్రికలో రాసి ఉండవచ్చుగా..? రాస్తే వచ్చే రియాక్షన్ వారికి తెలుసు. ఆ మాట అన్నవాడిని, దీక్షకు కూర్చున్నవాడిని ప్రజలు ఛీ కొడతారు. ఆ పత్రికలో కనీసం రాయలేని మాట అన్నాడని రాసినా బాగుండేది. ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారని తెలుసు. టీడీపీకి వకాల్తా పుచ్చుకున్న రామోజీ, రాధాకృష్ణను ఆ మాట అంటే ఊరుకుంటారా.. ?
- తిట్లు తిట్టించుకోవడం వ్యూహం అని పచ్చిగా రాస్తున్నారు. వీళ్ళు అసలు మనుషులేనా..?
- రామోజీ జనం మెదళ్ళలో ఏమి ఎక్కించాలని చూస్తున్నాడు. అర్జెంటుగా జగన్ గారిని అధికారంలో నుంచి దించేసి, చంద్రబాబును ఎక్కించాలని చూస్తున్నాడు. 
 
14- మహిళలను అవమానించేలాగానీ, ఇటువంటి బూతు మాటలు గానీ.. మా వైపు నుంచి ఎప్పుడైనా అన్నారా.. ఒకవేళ ఎవరైనా అంటే కూడా, సంజాయిషీ అడుగుతాం. మహిళలను అవమానించే వాళ్ళకు ఇక్కడ స్థానం ఉండదు.
-  రాష్ట్ర రాజకీయాల్లో నేడు.. ఏది సమస్యగా మారిందో, చెప్పుకోవటానికి కూడా మీకు సిగ్గు వేస్తుందే.. దానిమీద 2021లో చర్చ జరగటం కూడా అసహ్యం వేస్తుంది. కొత్త తరం రాజకీయాల్లో.. ఒక  బూతు మాట గురించి ఒక వ్యక్తి(చంద్రబాబు) ఉద్యమం నిర్మిస్తుంటే.. ఏం చెప్పాలి. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి. ప్రజలంతా దీనిని ఆమోదిస్తారా.. లేకపోతే.. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ నేతల్ని ఎక్కడికక్కడ నిలదీయాలి. 
 
15- అర లీటరు నీళ్ళతో రోజంతా ఉన్నాడని ఈనాడులో ఎలా రాస్తున్నారు..?  మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు అసలు అరలీటరు నీళ్ళు తాగి ఉండగలరా.. ఏదైనా చెప్పినా, రాసినా నమ్మేటట్టు ఉండాలి కదా.. ఆ మందు ఏదో కనుక్కుంటే.. డయాబెటీస్ వారంతా అక్కడ క్యూ కడతారు. చంద్రబాబు దీక్ష కూడా అబద్ధమే. అసలు చంద్రబాబే పెద్ద అబద్ధం. మన దురదృష్టం ఏంటంటే.. ఆయన రూపంలో, ఆయన పార్టీ రూపంలో అది నిజమైంది. 
 
16- ఎక్కడైనా విధానాల మీద చర్చించుకోవాలి, కొట్లాడుకోవాలి. బద్వేల్ లో పోటీ చేస్తే.. మీకు ఎన్ని ఓట్లు వచ్చేయో తెలిసేది కదా..  తెలుగుదేశం రాజకీయాలు చూస్తే.. మీరు ఊ అనండి.. మేం వేసేస్తాం అంటున్నారు. ఎంతమంది వస్తారో రండి. చంద్రబాబు భవిష్యత్తు తరాలకన్నా... ఒక హెల్ప్ చేయాలి ,  ఇలాంటి మాటలు తప్పు అని ఇప్పటికైనా ఒప్పుకోవాలి. ఇలాంటి పదజాలం రాజకీయ వేదికల్లో ఉండకూడదని చంద్రబాబు ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలి. ఆయన ఎందుకో రియలైజ్ కావడం లేదు. 
 
17- ఎవరు ఏం రెచ్చగొట్టినా, రాజకీయ పార్టీగా మేం రెస్పాన్స్ ఇవ్వం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి మాట్లాడిన రోజు,  ఆవేశానికి గురైన మా జగన్ మోహన్ రెడ్డిగారి అభిమానులు కచ్చితంగా రియాక్ట్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు ఇంతకన్నా ఘోరంగా చెత్త నా కొడుకు అన్నా..  దళిత హోం మంత్రిని పట్టుకుని  బూతులు తిట్టాడు. అయినా, మేం సంయమనంతోనే ఉన్నాం, మాకు బలం  లేకనా, జనం లేకనా. ప్రజలకు సేవ చేయడం తప్ప, ఇటువంటి ఎత్తుగడలు, గొడవలు వద్దు అని జగన్ గారు ఎప్పుడూ చెబుతారు. దాన్ని అసమర్థత అని చంద్రబాబు అనుకుంటారేమో, కాదు. 
 
18- టీడీపీ నేతలు మాట్లాడినట్టుగా.. మేం పెద్దలం నలుగురు  కలిసి కూర్చునో, ఎమ్మెల్యేలు ముందుగా అనుకుని ఉంటే, దాడి చేయాలంటే, పది మంది పిల్లలు పోతారా, అది వేరే రకంగా ఉండేది. ప్రజాస్వామ్యంలో అలాంటి పోకడలు వద్దు అనుకుంటున్నాం. ఎప్పుడైనా ప్రజా క్షేత్రంలోనే మేము పోరాడతాం. ప్రజా సేవకు అవసరమైన సరుకు మీ దగ్గర లేక, అడ్డగోలుగా బూతులు తిట్టి, మీడియాలో ఎగిరి, ప్రజల బుర్రలను కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 
19- ఇటువంటి వారి ఆటలు కట్టించాలంటే, మహిళలు, యువత ముందుకు రావాలి. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు చేసింది తప్పు, క్షమాపణ చెప్పాలని  ప్రతి ఒక్కరూ నిలదీయాలి. చేతగానివాళ్ళే బూతులు, దూషణలకు దిగుతారు. బాధ్యతాయుతమైన పార్టీలు ఇలా చేయవు. ఇలాంటి పార్టీలకు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉండకూడదు. అందుకే అటువంటి పార్టీ గుర్తింపు రద్దు చేయమని మా ఎంపీలు వచ్చే వారం సోమవారం లేక మంగళవారం ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ను కలుస్తారు. 
- ఇప్పటికైనా చింతిస్తున్నానని చంద్రబాబు చెబితే.. పాప విముక్తి జరుగుతుంది. బూతుల ప్రయోగం చేసినందుకు జగన్ మోహన్ రెడ్డిగారిని, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు క్షమాపణలు  కోరాలి. అలా కోరనంతవరకు, ఆయనంత నికృష్టుడు, చరిత్ర హీనుడు ఇంకొకరు ఉండరన్నది ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఆ పార్టీ సీనియర్లు ఆయనకు బాబుకు కొంచెం ఇంగిత జ్ఞానం నేర్పించాలి. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూడా,  భార్యలు, పిల్లలు చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి.