సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 అక్టోబరు 2021 (22:26 IST)

అమరావతి రైతుల మహాపాదయాత్ర, జనసేనాని పవన్ మద్దతు కోరుతూ...

అమరావతి రాజధాని కోసం గత రెండేళ్లుగా దీక్ష చేస్తున్న రైతులు తుళ్లూరు నుంచి తిరుమలకు 45 రోజుల పాటు మహాపాద యాత్ర చేయనున్నారు. ఇందుకోసం జనసేన మద్దతు కోరుతూ రైతులు జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్‌ను కలిసారు. ఈ పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. తమ మద్దతు రైతులకు వుంటుందనీ, పాదయాత్ర విజయవంతం కావాలని నాదెండ్ల ఆకాంక్షించారు.
 
ఇదిలావుండగా ఈ మహాపాదయాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాత్ర నవంబర్ 1వ తేదీ ప్రారంభమై డిశంబర్ 17వ తేదీతో ముగుస్తుంది.