శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (08:26 IST)

దసరా పండగ రాకుండానే సంక్రాంతి రైళ్లలో బెర్తులన్నీ ఫుల్!

train
దసరా పండుగ రాకముందే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిచే విశాఖ, గోదావరి, కోణార్క్, ఫలక్‌నుమా రైళ్లలో సంక్రాంతి బుకింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకాగా ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ టిక్కెట్లన్నీ కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో పూర్తయ్యాయి. సాధారణంగా సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ తమతమ సొంతూర్లకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే, ఈ యేడాది సంక్రాంతి పండుగకు మరో నాలుగు నెలల సమయం ఉంది. కానీ, హైదరాబాద్ నగరం నుంచి ఏపీకి దారితీసే అన్ని రైళ్ళలో రిజర్వేషన్లన్నీ ఫుల్‌అయ్యాయి. 
 
వచ్చే యేడాది జనవరి 11వ తేదీన హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్ తదితర రైళ్లకు శుక్రవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభంకాగా, కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే 8.05 గంటలకే మొత్తం స్లీపర్ క్లాస్ బెర్తులు నిండిపోయాయి. ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సంక్రాంతి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవడం ఇదే తొలిసారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.