మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 అక్టోబరు 2019 (14:42 IST)

మా రోడ్డు చూడండి మహాప్రభో- గాడిదపై ఊరేగుతూ(Video)

పార్వతీపురం- రాయఘడ అంతరాష్ట్రీయ రహదారి దుస్థితిపై సిపిఎం నేతలు రోజుకో వినూత్న రీతిలో తమ నిరసనను తెలుపుతున్నారు.  పార్వతీపురం.. రాయఘడ్ రహదారి పూర్తిగా గోతులమయం అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
అధికారులు తాత్కాలికంగా రహదారి మరమ్మత్తులు చేస్తున్నప్పటికి... వర్షం వచ్చిన వేంటనే పూర్తిగా గోతులమయం అవుతుంది. దీంతో భారీ వాహనాలు గోతుల్లో ఇరుక్కుని కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు స్థానికులు. 

 
ప్రభుత్వం తీరుకి నిరసనగా.. మొన్న రోడ్డుపై వరి నాట్లు వేసిన స్థానికులు, నిన్న గాడిదతో ఊరేగారు. నేడు గోతుల్లో ఈత కొడుతూ  వినూత్న నిరసన తెలిపారు.