శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 15 జులై 2017 (14:39 IST)

మోడీ గారూ.. ట్రిపుల్ తలాక్‌ను పక్కనబెట్టండి.. మీ భార్య సంగతేంటో చూడండి!

ట్రిపుల్ తలాక్ సంగతిని కాసేపు పక్కనబెట్టి.. తన భార్య సంగతేంటో ముందుగా తేల్చుకోవాలని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ సూచించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో బీజేప

ట్రిపుల్ తలాక్ సంగతిని కాసేపు పక్కనబెట్టి.. తన భార్య సంగతేంటో ముందుగా తేల్చుకోవాలని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ సూచించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని దుయ్యబట్టారు. వ్యక్తిగతంగా తాను ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకమని షబ్బీర్ అలీ తేల్చారు. అయితే ట్రిపుల్ తలాక్ సంగతిని కాసేపు పక్కనబెట్టి.. ప్రధాని తన భార్య సంగతి ముందు తేల్చాలన్నారు. 
 
ఇక తెలంగాణలో కేసీఆర్ పాలన సరిగ్గా లేదని షబ్బీర్ చెప్పారు. కేసీఆర్ తన మాటల గారడీతో అసత్యపు హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ తన వాక్ చాతుర్యంతో ప్రజలను మభ్యపెడుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ నేతలను తిట్టే అంశాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేశామని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. 2019లోగా టీఆర్‌ఎస్‌లో చేరతారనీ డిప్యూటీ సీఎం అవుతారన్న వదంతులను షబ్బీర్ అలీ ఖండించారు.