శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (12:00 IST)

పది రోజులుగా ఇంట్లోనే శవం.. దుర్వాసన.. అయినా పక్కనే కూర్చుని భోజనం..?

జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వారావుపేట రహదారిలోని మేఘన టవర్స్‌లో టి.అరుణజ్యోతి(41) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మరణించి ఐదురోజులు వుంటుందని.. ఇంటి

జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వారావుపేట రహదారిలోని మేఘన టవర్స్‌లో టి.అరుణజ్యోతి(41) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మరణించి ఐదురోజులు వుంటుందని.. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా ఇంట్లోనే అరుణ జ్యోతి మృతదేహాన్ని కనుగొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాల నేపథ్యంలో జీలుగుమిల్లికి చెందిన టి.మంజులాదేవి (70), ఆమె కుమారుడు టి.రవిచంద్ర(39), కుమార్తె టి.అరుణజ్యోతి(41)లు జంగారెడ్డిగూడెంలోని మేఘన టవర్స్‌ మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. గత కొంత కాలంగా తమ ఆస్తులకు సంబంధించి తగాదాలు జరుగుతుండటంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అరుణ జ్యోతి ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
మృతి చెందిన అరుణజ్యోతి అయిదు రోజులుగా ఇంట్లోనే శవంగా పడి ఉంది. తల్లి, కుమారుడికి కూడా మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతో శవం పక్కనే కూర్చుని రవిచంద్ర భోజనం చేస్తున్నాడు. తమ కుమార్తె చనిపోలేదని, నిద్రపోతుందని పోలీసులపై మండిపడ్డారు. వైద్యులు వచ్చి ధ్రువీకరిస్తే తప్ప నమ్మం అంటూ సోదరుడు రవిచంద్ర అనడంతో పోలీసులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి బలవంతంగా శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.