శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (11:39 IST)

అల్లుడితో అక్రమసంబంధం.. కుమార్తె ఇంట్లో లేని సమయంలో?

కుమార్తె జీవితంలో ఓ తల్లి నిప్పులు పోసింది. అల్లుడుతో అక్రమసంబంధం పెట్టుకుని.. కూతురిని బెదిరింపులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు అరియలూరు జిల్లా, జయంకొండాం సమీపం వడకడల్‌ గ్రామానికి చెంద

కుమార్తె జీవితంలో ఓ తల్లి నిప్పులు పోసింది. అల్లుడుతో అక్రమసంబంధం పెట్టుకుని.. కూతురిని బెదిరింపులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు అరియలూరు జిల్లా, జయంకొండాం సమీపం వడకడల్‌ గ్రామానికి చెందిన మహిళ (45)కు అదే ప్రాంతానికి చెందిన బిచ్చై కుమారుడు, కార్మికుడు రాజు (21)తో పరిచయం ఏర్పడింది. సదరు మహిళకు కుమార్తె (22) ఉంది. ఆమెను రాజుకు ఇచ్చి వివాహం చేసింది. 
 
భర్త మరణించడంతో కూతురు, అల్లుడిని ఇంటివద్దే కాపురం పెట్టుకుంది. ఈ క్రమంలో అత్త అల్లుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. ఇంట్లో కూతురు లేని సమయం చూసి అల్లుడు, అత్త ఏకాంతంగా గడిపేవారు. అయితే ఈ వ్యవహారం తెలుసుకున్న కూతురు తల్లిని నిలదీసింది.
 
కానీ కుమార్తెను తల్లి బెదిరింపులకు గురిచేసింది. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో తల్లి నుండి భర్తను కాపాడుకునేందుకు చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.