సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (16:41 IST)

ముహూర్త సమయానికి పెళ్లికూతురు జంప్.. బంధువులమ్మాయితో?

ముహూర్త సమయానికి పెళ్లికూతురు జంప్ అయ్యింది. చివరికి బంధువులమ్మాయితో వరుడి పెళ్లి జరిగింది. ఈ ఘటన జూన్ 4వ తేదీన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బన్రుట్టి గ్రామానికి చెందిన పూలవ్యాపారి అ

ముహూర్త సమయానికి పెళ్లికూతురు జంప్ అయ్యింది. చివరికి బంధువులమ్మాయితో వరుడి పెళ్లి జరిగింది. ఈ ఘటన జూన్ 4వ తేదీన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బన్రుట్టి గ్రామానికి చెందిన పూలవ్యాపారి అళగేశన్‌కు సోమకోట గ్రామానికి చెందిన రంజితంతో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.
 
బంధుమిత్రులంతా పెళ్లికి హాజరయ్యారు. చివరికి ముహూర్తం సమయానికి పెళ్లి కూతురు కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో, అప్పటికప్పుడు బంధువుల అమ్మాయితో వరుడి పెళ్లి జరిపించేశారు కుటుంబీకులు. 
 
ఆపై పెళ్లి కుమార్తె అదృశ్యంపై ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వధువు ఎక్కడికెళ్లింది? పెళ్లి ఇష్టం లేక జంప్ అయ్యిందా? ఆమెకు ప్రేమ కోణం ఏదైనా వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.