మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (16:10 IST)

పళనిసామి కఠిన నిర్ణయం.. 2019 జనవరి నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం

తమిళనాడు సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంది. పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్లాస్టిక్ విషయంలో తమిళ సర్కారు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వచ్చే ఏడాది నుంచి

తమిళనాడు సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంది. పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్లాస్టిక్ విషయంలో తమిళ సర్కారు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు.
 
మాజీ ముఖ్యమంత్రి జయలలిత నియమించిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించినట్లు పళని సామి తెలిపారు. వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయని, భూగర్భ జలాలకు సమస్యాత్మకంగా మారుతున్నాయని పళనిసామి వెల్లడించారు.
 
అందుకే ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధిస్తున్నట్లు పళనిసామి ప్రకటించారు. పాలు, పెరుగు, నూనె, మందుల ప్యాకింగ్‌లకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందని పళని సామి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమలుకు ప్రజలు, వర్తకులు సహకరించాలని కోరారు.