1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (09:43 IST)

భర్త వృషణాలను దిండుతో నొక్కి చంపేసిన భార్య...

కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు భర్తలు తమతమ భార్యల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అదీకూడా పడక గదిలో తమతో సన్నిహితంగా ఉన్న సమయంలోనే భార్యలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఒక కేసులో భర్త వృషణాలను నొక్కి చంపేయగా, మరో

కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు భర్తలు తమతమ భార్యల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అదీకూడా పడక గదిలో తమతో సన్నిహితంగా ఉన్న సమయంలోనే భార్యలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఒక కేసులో భర్త వృషణాలను నొక్కి చంపేయగా, మరో కేసులో క్రికెట్ బ్యాటుతో భర్తను తలపై బలంగా కొట్టి చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిద్ధాం.
 
బెంగుళూరు, ఎరాలహళ్లి ప్రాంతానికి చెందిన గంగారత్న, సంజీవప్ప(35) అనే దంపతులు ఉన్నారు. సంజీవప్పకు నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ప్రతి రోజూ మద్యం తాగివచ్చి తనను వేధిస్తున్నాడనే కోపంతో గంగారత్న భర్త వృషణాలను దిండుతో నొక్కి హతమార్చింది. 
 
తన భర్త పీకల దాకా మద్యం తాగి మరణించాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సంజీవప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో భార్య గంగారత్నను పోలీసులు అరెస్టు చేశారు. 
 
అలాగే, హుబ్బలి ప్రాంతానికి చెందిన శివయోగిని అతని భార్య భారతి క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపింది. మద్యం తాగి మంచం మీద నుంచి కింద పడి భర్త మరణించాడంటూ పోలీసులకు భార్య తప్పుడు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా భారతినే భర్తను హతమార్చిందని తేలింది. దీంతో పోలీసులు భారతిని కటకటాల్లోకి నెట్టారు.