శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (08:56 IST)

కర్ణాటక సంకీర్ణ సర్కారులో లుకలుకలు.. ఎస్ఆర్ పాటిల్ రాజీనామా

కర్ణాటక సంకీర్ణ సర్కారులో అపుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన ఎస్ఆర్ పాటిల్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా క

కర్ణాటక సంకీర్ణ సర్కారులో అపుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన ఎస్ఆర్ పాటిల్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. 
 
లింగాయత్ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన ఈయన... ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వాస్తవానికి అసలు కారణం ఇదికాదు. 
 
జేడీఎస్‌తో పొత్తుపై తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడం, లింగాయత్ కోటాలో డిప్యూటీ సీఎం పదవిని ఆశించి భంగపడటం వంటి కారణాలతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. గత నెల 25 న రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పంపించారు. రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
తన రాజీనామా ఆయన స్పందిస్తూ, అధిష్టానం తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిందని, కానీ ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా నడిపించలేకపోయాను. పార్టీ అభ్యర్థులను విజయాలవైపు నడిపించలేకపోయిన తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. తన రాజీనామాకు అదే కారణమని ఆయన చెప్పుకొచ్చారు.