శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (13:49 IST)

బిర్యానీ ఎంచక్కా లాగించేశారు.. డబ్బులడిగితే.. తుపాకీతో..?

హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుం

హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌‍లో బిర్యానీ లాగించిన కస్టమర్ల వద్ద ప్లేట్‌ బిర్యానీ ఖరీదు రూ.190 ఇవ్వాలని హోటల్‌ యజమాని అడిగాడు. ఈ విషయంపై వాగ్వాదం తలెత్తింది. దీంతో నలుగురు కస్టమర్లలో ఒకరు తుపాకీతో యజమాని సంజయ్‌ని కాల్చి పరారైనారు. ఈ ఘటనలో గాయపడిన సంజయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మహమ్మద్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.