సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (10:03 IST)

బహిర్భూమికి వెళితే... లాక్కెళ్లి రేప్ చేయబోయారు... ఎక్కడ?

మహిళలకు ఎక్కడా రక్షణలేకుండా పోతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఓ వివాహితపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. సదరు మహిళ అనారోగ్యంతో బాధపడుతూ బహిర్భూమికి వెళ్లగా, ఆమెను బలవంతం

మహిళలకు ఎక్కడా రక్షణలేకుండా పోతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఓ వివాహితపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. సదరు మహిళ అనారోగ్యంతో బాధపడుతూ బహిర్భూమికి వెళ్లగా, ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేయబోయారు. అయితే, ఆ మహిళ ఆ ఇద్దరు కామాంధులను ప్రతిఘటించి కేకలు వేయడంతో తప్పించుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా పాత పట్టణానికి చెందిన దంపతులు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్దకు వచ్చి ఓ తాపీమేస్త్రీ వద్ద రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం అనారోగ్యంగా ఉండటంతో సదరు భార్య పనికి వెళ్ళలేదు. వీరి ఇల్లు డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె పొలాల్లోకి బహిర్భూమికి వెళుతుండగా స్థానిక ఇప్పటం, గుండిమెడ ప్రాంతాలకు చెందిన లచ్చి ప్రసాద్‌, బి. సుధీర్‌ ఆమెను అనుసరించారు. కొంతదూరం వెళ్ళాక ఆమెను పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె వారిని తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు, బంధువులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆమెను రక్షించారు. నిందితులను పట్టుకొని చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు కామాంధులను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.