గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఏది నిజం
  3. ఇదీ సంగతి
Written By TJ
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (13:22 IST)

ముఖం చూసి చావు ఎప్పుడో చెప్పేసే వృద్ధురాలు.... తన ముఖం చూసుకుని తన చావు కూడా చెప్పేసింది...

బ్రహ్మదేవుడు తప్ప మన చావు ఎప్పుడనేది ఎవరికీ తెలియదంటారు. ఇది జగమెరిగిన సత్యమే. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలిస్తే చచ్చిపోకుండా వుండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా. కాన

బ్రహ్మదేవుడు తప్ప మన చావు ఎప్పుడనేది ఎవరికీ తెలియదంటారు. ఇది జగమెరిగిన సత్యమే. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలిస్తే చచ్చిపోకుండా వుండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా. కానీ ఎవరు ఎప్పుడు చనిపోతారా చెప్పే ఒక మహిమ గల వృద్ధురాలు తిరుపతిలో ఉంది. ఎంతోమంది అనారోగ్యానికి గురైతే వారు బతుకుతారా.. లేదా అన్న విషయాన్ని ముఖం చూసే చెప్పేసేది. నిజంగానే ఆమె చెప్పినట్లే జరిగేది. అలాంటి వృద్ధురాలు చివరకు తన ముఖాన్ని చూసుకుని తన మరణం ఎప్పుడో తానే చెప్పుకుని ఆ రోజే చనిపోయింది. 
 
తిరుపతిలో జరిగిన ఈ వింత సంఘటన వివరాలను చూస్తే.... తానెప్పుడు చనిపోతానన్న విషయాన్ని నాలుగు రోజుల ముందుగానే బంధువులకు చెప్పిందా వృద్ధురాలు. చనిపోయే సమయాన్ని కూడా చెప్పి మరీ అదే సమయానికి మరణించింది. రైల్వే కాలనీకి చెందిన ఊర్వసమ్మ గతంలో వడమాలపేటలో శక్తి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తుండేది. 
 
ఆ తరువాత తిరుపతికి వచ్చేసిన ఊర్వసమ్మ స్థానికంగా టిటిడికి చెందిన సత్రాల్లో పనిచేస్తూ జీవనం సాగించేది. అయితే ఎవరైనా అనారోగ్యానికి గురై ఊర్వసమ్మను పిలిస్తే వారు బతుకుతారా, చనిపోతారా అన్న విషయం స్పష్టంగా సమయంతో పాటు చెప్పేదని బంధువులు చెబుతున్నారు. అదేవిధంగా తన మరణ సమయాన్ని కూడా ఊర్వసమ్మ చెప్పిందని, నిన్న రాత్రి 11.55 నిమిషాలకు చనిపోతానని చెప్పిన ఆమె అదే సమయానికి చనిపోయిందని కుమారుడు చెబుతున్నాడు. ఈ వింత విన్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.