బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మే 2024 (09:39 IST)

ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన 'పంజాబ్ వ్యాధి' - అంతుచిక్కని వ్యాధితో హడలిపోతున్న వైద్యులు!

doctor
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి వ్యాపించింది. ఇది పంజాబ్ రాష్ట్రం నుంచి వ్యాప్తించింది. ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకున్న వైద్యులే హడలిపోతున్నారు. ఈ అంతు చిక్కని వ్యాధి ఉనికి రాష్ట్రంలో కనపించడం ఇపుడు కలకలం రేపుతోంది. ఈ వ్యాధి పేరు సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అనే ఈ వ్యాధిని పల్నాడు. జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ కిరణకుమార్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 'పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురంతండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ విభాగం వైద్యులు ప్రయోగశాలలో రక్తపరీక్ష చేయగా.. వారు సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. 
 
చాలా అరుదైన ఈ సమస్యకు ఎముక మజ్జ (మూలకణ) మార్పిడి చికిత్స ఒక్కటే సరైన పరిష్కారం. ఈ చికిత్స ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేదు. తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి ఎక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుంది' అని కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ వ్యాధి గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పెథాలజీ విభాగం అధిపతి అపర్ణ పేర్కొన్నారు.