శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (20:19 IST)

మామిడి చెట్టు పక్కన సింగర్ సునీత.. మీకో దండం నాయనా అంటూ...

sunitha mango
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ గాయని సునీత మళ్లీ తల్లి అయిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. సునీత ఓ మామిడి చెట్టు దగ్గర మామిడి కాయను చేతితో తాకుతూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సునీత తల్లికాబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. 
 
ఈ వార్తలపై సునీత స్పందించారు. "మీకో దండం నాయనా.. జనాలు ఇంత క్రేజీగా ఉంటారా... మామిడి చెట్టుకు తొలిసారి కాయలు కాయడంతో వాటితో ఫోటో దిగాను. దాన్ని ఈ విధంగా ప్రకారం చేస్తారా? ఊహాజనిత కథనాలు, రూమర్లను వ్యాపించచేయడం ఇకనైనా ఆపండి" అంటూ సింగర్ సునీత హితవు పలికారు.