ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 మే 2017 (10:56 IST)

తక్కువ ధరకు బియ్యం ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి వివాహితపై వ్యాపారి అత్యాచారం

హైదరాబాద్‌లో ఓ 45 యేళ్ళ వివాహితపై అత్యాచారం జరిగింది. తన దుకాణానికి వచ్చిన ఓ మహిళకు తక్కువ ధరకు బియ్యం ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీ

హైదరాబాద్‌లో ఓ 45 యేళ్ళ వివాహితపై అత్యాచారం జరిగింది. తన దుకాణానికి వచ్చిన ఓ మహిళకు తక్కువ ధరకు బియ్యం ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నగర్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బియ్యం కొనేందుకు 45 ఏళ్ల వివాహిత అతని దుకాణానికి వచ్చింది. దుకాణంలో ఉండే బియ్యం ధర కాస్త ఎక్కువగా ఉందని, ఇంటికి వస్తే అక్కడ తక్కువ ధర బియ్యం ఉన్నాయని, అవి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో ఆయన వెంట ఆ మహిళ ఇంటికెళ్లింది. 
 
వివాహిత వ్యాపారి ఇంట్లో ఉన్న బియ్యం నాణ్యత చూస్తుండగా ఒక్క ఉదుటున వెనుకనుంచి పట్టుకొని తనపై అత్యాచారం చేశాడని బాధిత వివాహిత పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ అత్యాచారానికి మరో వ్యక్తి సహకరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.