నాతో పవన్ కల్యాణ్.. మైదానంలో జన సునామీ.. ప్రధాని
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అత్యధిక బీసీ ఎంపీలు బీజేపీ నుండే ఉన్నారని వెల్లడించారు. కేంద్ర కేబినెట్లో ఓబీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించారు.
ఈ వేదికపై పవన్ కల్యాణ్ తనతో ఉన్నారని.. మైదానంలో జన సునామీ ఉందని చెప్పారు మోదీ. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ, పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేనానికి ప్రధాని పక్కనే సీటును కేటాయించారు. పవన్ కూర్చుంటుండగా మోదీ భుజంపై తట్టారు. ప్రతిగా జనసేనాని నమస్కారం పెట్టారు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.