శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (08:48 IST)

తెలంగాణాలో బీజేపీ - జనసేనల పొత్తు ఖరారు - నేడు ఉమ్మడి కార్యాచరణ

pawan - kishan
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి పని చేయనున్నాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తొమ్మి స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే, బీజేపీ ఇప్పటివరకు 88 చోట్ల అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మరో 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సివుంది.
 
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో శనివారం రాత్రి సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో కీలక చర్చలు జరిగాయి. ఇందులో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు, కీలక చర్చలు జరిగాయి. 
 
ఇందులో జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఇందులో కూటమి అభ్యర్థుల విజయం కోసం కలిసి పని చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఆదివారం ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ముఖ్యంగా, జనసేన ఏయే నియోజకవర్గల్లో పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను వెల్లడించనున్నారు. 
 
అదేసమయంలో ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. స్థానిక ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు హాజరుకావాలని కోరగా పవన్ కళ్యాణ్‌ను బీజేపీ నేతలు కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ నేతలు వెల్లడించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గతంలో అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించిందని, ఈ ఎన్నికల్లో జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని బీజేపీ టీఎస్ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.