శ్రీలీలను చూస్తే జయసుధ, జయప్రద, శ్రీదేవిలు గుర్తుకు వచ్చారు : దిల్ రాజు
భగవంత్ కేసరి విజయం గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో అనిల్ రావిపూడి ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. భగవంత్ కేసరి గురించి నాకు ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ యాసలో బాలకృష్ణ గారు డైలాగ్స్ చెబితే చాలా కొత్తగా ఉంటుందన్నా. ముందు నుంచీ బ్రో ఐ డోంట్ కేర్ని టైటిల్ అనుకుని తర్వాత భగవంత్ కేసరిగా మార్చాడు. ఎక్కువగా ఎంటర్‌టైనింగ్ సినిమాలు తీసే అనిల్ ఇలాంటి బలమైన కథను రాసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. అనిల్ లో చాలా సామర్ధ్యం వుంది. అనిల్ ఇప్పుడు 2.o. తను ఇలాంటి అద్భుతమైన కథలు రాయాలి. ఇంత మంచి చిత్రాన్ని అందించిన అనిల్ కు అభినందనలు.
తమన్ చక్కని మ్యూజిక్ చేశారు. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్ అనేవారు. కానీ, ఇందులోని ఆమె నటన జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలకృష్ణ మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ ఇవన్నీ క్లాసిక్స్. ఇప్పుడు మరో క్లాసిక్ గా భగవంత్ కేసరి వచ్చింది. బాలకృష్ణ గారి డెడికేషన్‌తో ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించింది. నిజంగా బాలయ్య గారికి సలాం కొట్టాలి. ఇలాంటి సినిమాలు చేస్తూ క్లైమాక్స్ లో అమ్మాయితో ఫైట్ ఒప్పుకున్నందుకు బాలకృష్ణ గారికి హ్యాట్సప్ . ఇది లాంగ్‌రన్ ఫిల్మ్. తప్పకుండా ప్రతి తెలుగు కుటుంబం ఈ సినిమా చూస్తుంది అన్నారు