బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:31 IST)

ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే తీసుకునేది.. శ్రీదేవిపై నోరువిప్పిన బోనీకపూర్

boney kapoor
2018లో అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూశారు. నటి మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తన భార్య మరణానంతరం ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కొన్నాళ్లపాటు మౌనం వీడారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు తన భార్య మరణం గురించి మాట్లాడారు.
 
24 ఫిబ్రవరి 2018 హిందీ సినిమా తన మొదటి సూపర్ స్టార్ శ్రీదేవిని శాశ్వతంగా కోల్పోయిన భయంకరమైన రోజు. దుబాయ్‌లో ఆమె ఆకస్మిక మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. హోటల్ బాత్‌రూమ్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందినట్లు సమాచారం. 
 
వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా మరోసారి స్పందించారు. తన భార్య సడెన్‌గా చనిపోవడంతో దుబాయ్ పోలీసులు తనను సుదీర్ఘంగా విచారించారని తెలిపారు. దాదాపు 48 గంటల పాటు అన్ని రకాలుగా ప్రశ్నించి, శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని తేలడంతోనే తనను వదిలిపెట్టారని చెప్పారు.
 
తన భార్య చనిపోవడానికి కారణం ఆమె ఆహార నియమాలేనని భావిస్తున్నట్లు బోనీ కపూర్ చెప్పారు. శరీరాకృతిని అందంగా ఉంచుకునేందుకు ఆమె కఠినమైన డైట్‌ను ఫాలో అయ్యేదని తెలిపారు. 
 
ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే, అదీ అతి తక్కువ పరిమాణంలో తీసుకునేదని వివరించారు. దీంతో శ్రీదేవి లోబీపీతో బాధపడేదని, తరచూ కళ్లు తిరిగి పడిపోయేదని బోనీ కపూర్ చెప్పారు. వైద్యులు చెప్పినా ఆమె తన ఆహారపుటలవాట్లను మార్చుకోలేదని వివరించారు.