తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ - జనసేన పార్టీల కుదిరిన పొత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ రెండు పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై కూడా ఒక స్పష్టత రావడంతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి.
ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా, జనసేన పార్టీకు 8 లేదా 10 సీట్లను కేటాయించనుంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో జనసేనకు రెండు సీట్లను కేటాయించేందుకు సిద్ధమైంది. కూకట్‌పల్లితో పాటు మరో సీటును జీహెచ్ఎంసీ పరిధిలో సీటును ఇవ్వనుంది.
అయితే, గతంలో జనసేన నుంచి 30 మందిని అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమైనప్పటికీ ఆ పార్టీల మధ్య జరిగిన చర్చల కారణంగా తక్కువ స్థానాలకే జనసేన పరిమితమైనట్టు తెలుస్తుంది. అయితే, ఈ రెండు పార్టీల మధ్య బంధం ఏ విధంగా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.