శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (16:19 IST)

జగనూ.. వైకాపా అధ్యక్షురాలిగా లక్ష్మీపార్వతిని ప్రకటించు చూద్దాం..!: సోమిరెడ్డి సవాల్

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి సెటైర్లు విసిరారు. వైకాపా చీఫ్ జగన్ రెడ్డిపై 12 కేసులుంటే ఆ పార్టీ జిల్లా అధ్యక్షులపై అరడజను చొప్పున కేసులున్నాయని విమర్శించారు. జగన్‌క

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి సెటైర్లు విసిరారు. వైకాపా చీఫ్ జగన్ రెడ్డిపై 12 కేసులుంటే ఆ పార్టీ జిల్లా అధ్యక్షులపై అరడజను చొప్పున కేసులున్నాయని విమర్శించారు. జగన్‌కు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై అంత ప్రేమ అనేది వుంటే వైకాపా అధ్యక్షురాలిగా లక్ష్మీపార్వతిని ప్రకటించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే తాము పోరాడుతామని, అక్కడ వైకాపా ఏం చేస్తుందని సోమిరెడ్డి ప్రశ్నించారు.
 
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ గట్టిగా కోరుతుందని.. ఈ మేరకు మహానాడులో తీర్మానం చేశామని సోమిరెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ తనయుడు, సినీ నటుడు బాలకృష్ణ విదేశాల్లో ఉండటంతో మహానాడుకు రాలేకపోయారని.. జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారని సోమిరెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
కాగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలంటూ ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మహానాడులో తీర్మానం చేశారు. ఆయన ప్రభుత్వ సలహాదారు కావడంతో తీర్మానం చేయడం తప్పులేదని ఏపీ సీఎం చంద్రబాబు సైతం వివరణ ఇచ్చుకున్నారు. అయితే ప్రతీ మహానాడులోనూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నప్పటికీ అందుకు తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.