ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జులై 2020 (11:11 IST)

త్వరలోనే తెలుగు అకాడమి: లక్ష్మీపార్వతి

త్వరలోనే తెలుగు అకాడమి కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి తెలిపారు.

తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాత్కాలికంగా టీటీడీ భవనంలో తెలుగు అకాడమి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

తెలుగు ప్రాచీన గ్రంథాలు, పుస్తకాలు, సంస్కృతి తాళపత్ర గ్రంథాలను ఈ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో తెస్తామని పేర్కొన్నారు.