సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (16:58 IST)

వారాంతపు సెలవులు... తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు

trains
వారాంతపు సెలవులను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు.. వరలక్ష్మివ్రతం కారణంగా శుక్రవారం, శనివారం, ఆదివారం కలుపుకుని వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లను నర్సాపుర్‌ - సికింద్రాబాద్‌, కాకినాడ పట్టణం - సికింద్రాబాద్‌, కాచిగూడ - తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను ఏర్పాటు చేసింది. 
 
నర్సాపురం - సికింద్రాబాద్‌ (07175) రైలు ఆగస్టు 18న (ఆదివారం) నర్సాపుర్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయాన్నే 5 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. అలాగే, సికింద్రాబాద్‌ - నర్సాపుర్‌ (07176) రైలు ఆగస్టు 19న (సోమవారం) సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు నర్సాపుర్‌ చేరుకోనుంది. 
 
కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌ (07177) రైలు ఆగస్టు 17, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి.. ఆ మరుసటి రోజుల్లో ఉదయం 9.05 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకొంటుంది. అలాగే, ఈనెల 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరనున్న సికింద్రాబాద్‌ - కాకినాడ టౌన్‌ (07178) రైలు ఆగస్టు 19, 21వ తేదీల్లో ఉదయాన్నే 6.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. 
 
కాచిగూడ - తిరుపతి (07455) రైలు ఆగస్టు 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి ఆగస్టు 17న (శనివారం) ఉదయం 10.25గంటలకు తిరుపతి చేరుకోనుంది. అలాగే, తిరుపతి - కాచిగూడ (07456) రైలు ఆగస్టు 17న తిరుపతిలో రాత్రి 7.50గంటలకు బయల్దేరి..  మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9.30గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. 
 
కాచిగూడ పట్టణం - సికింద్రాబాద్‌ రైలు ఆగస్టు 18న సాయంత్రం 6.30గంటలకు కాకినాడలో బయల్దేరి.. మరుసటిరోజు ఉదయాన్నే 6 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. ఇకపోతే 07188 నంబర్‌ కలిగిన రైలు సికింద్రాబాద్‌లోఆగస్టు 19న రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది.