గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (12:09 IST)

'నయీం కౌన్' అన్నారో డెత్‌ కౌంటర్.. లొంగిపోయిన వెంటనే గ్యాంగ్‌లో చేరాలి... ఇదీ మాజీ నక్సల్స్ పరిస్థితి

నక్సలైట్‌గా ఉండి మాజీ నక్సలైట్‌గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా అవతారమెత్తిన నయీం పేరు చెపితే మాజీ నక్సలైట్లకు గుండెదడ. జనజీవన స్రవంతిలోకి వచ్చే మాజీ నక్సలైట్లు.. ఖచ్చితంగా నయీం గ్యాంగ్‌లో చేరాల్సింద

నక్సలైట్‌గా ఉండి మాజీ నక్సలైట్‌గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా అవతారమెత్తిన నయీం పేరు చెపితే మాజీ నక్సలైట్లకు గుండెదడ. జనజీవన స్రవంతిలోకి వచ్చే మాజీ నక్సలైట్లు.. ఖచ్చితంగా నయీం గ్యాంగ్‌లో చేరాల్సిందే. ముఖ్యంగా లొంగిపోవాలనుకున్నా, ముందు నయీంకే సమాచారమివ్వాలి. జైలు నుంచి బయటకొచ్చాక ముందు నయీంనే కలవాలి. లేదంటే నూకలు చెల్లినట్లే. ఎవరైనా 'నయీం కౌన్' అన్నారో వెంటనే డెత్‌ కౌంటర్ స్టార్ట్ అయినట్టే. 
 
తన నేర సామ్రాజ్యానికి మాజీ నక్సలైట్లను నయీం ఎంతగానో వాడుకున్నారు. నయీం అనుచరగణంగా 125 మంది మాజీ నక్సల్స్‌ పని చేస్తున్నారంటే మాజీ నక్సలైట్లను ఏ విధంగా వాడుకున్నరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అప్పటి పీపుల్స్‌వార్‌, నేటి మావోయిస్టు పార్టీ నుంచి ఎవరు లొంగిపోయినా తనను కలిసి ఆశీస్సులు తీసుకోవాలనేది నయీం పంతం. వారు తన వద్దకొస్తే ఓకే. లేదంటే వారికి బెదిరింపులు తప్పవు. అలా వచ్చే వారికి తన వద్ద శిక్షా తప్పదు. నయీం.. తన సామాజిక వర్గానికి చెందిన వారి కంటే.. మాజీ నక్సలైట్లనే అధికంగా తన పనులు ముగించేందుకు వినియోగించేవాడట.