Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నిరుద్యోగ మహిళల కోసం ఉచిత శిక్షణ-ప్రొఫెసర్ కెన్నెడీ

Written By ఎం
Updated: సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (16:25 IST)
యూనివర్సిటీ ఇన్ ఫ్రాన్స్ ప్రొఫెసర్ కెన్నెడీ.. అర్బన్ స్టడీస్, హైదరబాద్ అభివృద్ధి విషయాలపై సోమవారం పరిశోధన చేసేందుకై శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో సందర్శించారు. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సహకారంతో డివిజన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నైపుణ్యకేంద్రాలను సందర్శించారు. అందులో భాగంగా పాపిరెడ్డికాలనీ రాజీవ్ గృహకల్పలో సెయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ‌ నైపుణ్య కేంద్రాన్ని పరిశీలించారు.
 
నిరుద్యోగ మహిళల కోసం విభిన్న రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. బ్యుటీషియన్, కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణతో పాటు బేకరీలో తయారు చేసే కేకులు, తదితర తినుబండారాలను పరిశీలించారు. ప్రొఫెసర్ కెనడీ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కృషితో ఈ ప్రాంతంలో సెయింట్ శిక్షణ కేంద్రం ఏర్పడిందని, ఆయన సహకారంతోనే శిక్షణ పొందుతున్నట్లు పలువురు మహిళలు వెల్లడించారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వనగరాభివృద్ధి కోసం, నిరక్షరాస్యుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేస్తుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ప్రొఫెసర్ కెనడీ సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక ప్రజల కోసం చేస్తున్న సేవల పట్ల ఆకర్షితురాలై అభినందించారు. ఆమె వెంట హెచ్‌సీయూ విద్యార్థులు ఉన్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments