గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (12:36 IST)

ఈ నెల 20వ తేదీన ప్రత్యేక టీకా డ్రైవ్

ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను రాష్ట వ్యాప్తంగా 124 మంది పిల్లలను గుర్తించామన్నారు. వారిలో 86 మంది పేరున రూ.10 లక్షల చొప్పున నగదు డిపాజిట్ చేశామన్నారు.
 
ఈ క్యాంపెయిన్ లో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకా వేయ నున్నామన్నారు. ఇప్పటికే ఒకే రోజు 6 లక్షలకు పైగా డోసులు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం సాధించిందన్నారు. నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,22,83479 మందికి టీకా వేశామని తెలిపారు.

వారిలో 26,41,000 మందికి రెండు డోసులు, 71 లక్షల మంది ఒక డోసు వేశామని తెలిపారు. జూన్ నెలకు సంబంధించి 2,66,000 మందికి కొవాగ్జిన్, 2,10,000 మంది కొవిషీల్డ్ సెకండ్ డోసు వేయాల్సి ఉందన్నారు. 5,29,000 మంది అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు మొదటి డోసు వేశామన్నారు.