శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (10:42 IST)

నరసన్నపేటలో ఎర్రన్నాయుడి చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత

ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం కూల్చివేతలపర్వం కొనసాగిస్తుంది. అమరావతి గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. ఆ తర్వాత విపక్ష నేతలకు చెందిన భవనాలు, మీడియా సంస్థల భవాలను కూల్చివేస్తూ వస్తుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎర్రన్నాయుడి పేరుతో నిర్మించిన చిన్నపిల్లల పార్కును కూల్చివేసింది.
 
గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తీసుకుని ఈ చిల్డ్రన్స్ పార్కును నిర్మించారు. పైగా, ఈ పార్కు నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు కూడా మంజూరుచేసింది. అయినప్పటికి నిర్ధాక్షిణ్యంగా ఈ పార్కును అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ఈ కూల్చివేతలను టీడీపీ నేతలు, శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీలను సీజ్ చేశారు. 
 
పార్కు ప్రహరీ గోడ, రీడింగ్ రూమ్, కార్యాలయ గదులతో పాటు అంతర్గతంగా వేసిన రోడ్లను సైతం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మరికొందరు కార్యకర్తలు అక్కడకు చేరుకుని పార్కు కూల్చివేత పనులను అడ్డుకున్నారు. దీంతో కూల్చివేత కోసం వచ్చిన కొందరు వ్యక్తులు టీడీపీ నేతలతో దాడికి పాల్పడ్డాడు. రమణమూర్తి ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్నారు. కూల్చివేతల కోసం ఉపయోగించినచ జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఈ పార్కు నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా అప్పటి కలెక్టర్ అనుమతులు కూడా మంజూరుచేశారు. ఈ నిధుల్లో రూ.34.50 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు. అయితే, ఈ స్థలం తమదేనంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో నిర్మాణం పనులు ఆగిపోయాయి.