శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (18:55 IST)

శ్రీకాకుళంలో దారుణ ఘటన: గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో..?

ఏపీలోని శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వ్యక్తిని దుండగులు హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గూనపాలేనికి చెందిన దీర్గాశి హరీష్ కుమార్ బయట మాట్లాడుకుంటున్నారు. 
 
ఇంతలోనే అక్కడికి కొందరు దుండగులు వచ్చి గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో దీర్గాశి కరుణ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు. 
 
హరీష్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు పాత కక్షలే కారణం వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.