సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 18 మే 2018 (18:32 IST)

కారు నుంచి రోడ్డుపై దిగిన శ్రీరెడ్డి... షాక్ అయిన ఆందోళనకారులు... ఎందుకు?

శ్రీరెడ్డి పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వున్నదంటూ గత కొన్ని రోజులుగా పోరాడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ పైన చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇం

శ్రీరెడ్డి పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వున్నదంటూ గత కొన్ని రోజులుగా పోరాడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ పైన చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడంలేదు. కానీ హఠాత్తుగా ఆమె ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గురిజేపల్లి సమీపంలో ఉపాధి పనులు కల్పించడం లేదంటూ ఆందోళన చేస్తున్నవారిని చూసి కారు నుంచి కిందికి దిగారు. ఆమెను చూసిన ఆందోళనకారులు షాక్ తిన్నారు. 
 
ఇంతకీ అసలు జరిగిందేమిటంటే... మల్లిడి శ్రీరెడ్డి, మల్లికార్జున స్వామి దర్శనానికై శ్రీశైలం బయలుదేరారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి సమీపంలోకి రాగానే కొంతమంది రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తూ కనిపించారు. దాంతో శ్రీరెడ్డి తన కారును ఆపి కిందకు దిగి వారివద్దకు వెళ్లారు. ఆమెను చూసిన ఆందోళనకారులు కంగు తిన్నారు. 
 
శ్రీరెడ్డి తమ వద్దకు ఎందుకు వచ్చారా అని చూస్తూ కూర్చుండిపోయారు. ఇంతలో ఆమె తలపాగా చుట్టి వారితోపాటు కూర్చుని ఆందోళన చేసి, మరికొద్దిసేపు వారితో ముచ్చటించి అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. అదీ సంగతి.