బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:00 IST)

శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు

తిరుమలలో బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి ఆలయ అధికారులు వెల్లడించారు. 17,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. బుధవారం తిరుమల శ్రీవారిని 28,880 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
తిరుపతిలో నిలిచిపోయిన ఉచిత టోకెన్ల జారీ
టీటీడీ ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్లను 26వ తేదీ నుంచి కేటాయిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి తిరుపతిలో టోకెన్ల జారీ ఆగిపోయింది.

నిజానికి బుధవారం రాత్రి 9 గంటలకు 25వ తేదీకి సంబంధించిన టోకెన్లు మూడువేలు కేటాయించేశారు. ఎనిమిది వేలలో ఇక మిగిలింది అయిదువేలు మాత్రమే. ఈ అయిదువేలు కూడా గురువారం ఉదయం 6 గంటల్లోపు కేటాయించేశారు. దీంతో గురువారం నుంచే తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ఆగిపోయింది.