సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (10:03 IST)

వైద్య విద్యార్థిని ఆత్మహత్య... నాలుగో అంతస్థు నుంచి దూకి...

మరో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాలుగో అంతస్థు నుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో శుభశ్రీ అనే

మరో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాలుగో అంతస్థు నుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో శుభశ్రీ అనే విద్యార్థిని ఎంబీబీఎస్‌ చదువుతోంది. 
 
శుభశ్రీ స్వస్థలం విశాఖ కాగా.. ఆమె తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దిల్లీలో ఉంటున్నట్లు తెలుస్తోంది. శుభశ్రీ కొద్దికాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోందని, గతంలోనూ ఆత్మహత్యకు యత్నించినట్లు కళాశాల యాజమాన్యం చెబుతోంది.
 
ఈ నేపథ్యంలో శుభశ్రీ అనే విద్యార్థిని బుధవారం అర్థరాత్రి కళాశాల భవనం నాలుగో అంతస్థు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.