బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (15:29 IST)

06-12-2019 దినఫలాలు - పరిశోధనాత్మక విషయాలపై

మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించినట్లైతే ఫలితాలొస్తాయి. సిమెంట్ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 
 
తలపెట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. 
 
పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కూర, పూల, వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. 
 
ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. వృత్తులలో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. 
 
ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. స్త్రీలు టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారికి సామాన్యం. వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. 
 
ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారుతారు. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. 
 
స్త్రీలు తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓపికగా వ్యవహరించండి. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. వేతనం తక్కువైనా వచ్చినా అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. మంచి చేసినా విమర్శలు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. వెండి, బంగారు, వస్త్ర వ్యాపారులకు లాభదాయకం. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. 
 
ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. 
 
వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి. ప్రయాణాలు అనుకూలం. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం.