గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (07:51 IST)

జమ్మూలో టీటీడీ ఆల‌య నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన సుబ్బారెడ్డి

జమ్మూలో టీటీడీ నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం (శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు.

త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని అక్కడి అధికారులకు సుబ్బారెడ్డి తెలిపారు.

జమ్మూలో ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్మాణానికి పాలక మండలి సైతం ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి బుధవారం జమ్మూకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. వైవి సుబ్బారెడ్డితో పాటు జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్యాంసింగ్, కుమార్, అదనపు సీఈఓ వివేక్ వర్మ చైర్మన్ స‌హా ప‌లువురు అధికారులు ఆయ‌న వెంట ఉన్నారు.