గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (18:27 IST)

జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మన సైన్యం హతమార్చింది. షోపియాన్‌ జైనాసోరా సమీపంలోని రెబాన్ ప్రాంతంలో ఉదయం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

గత ఐదు నెలల్లో మొత్తం 80 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు.