గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (12:19 IST)

జమ్మూకశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటికే తొమ్మిదిమందిని హతమార్చిన భారతసైన్యం తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టింది.

భారత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లాలోని సుగూ గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. షోపియాన్‌ జిల్లాలో ఆదివారం నుంచి జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఇది మూడోది.

సోమవారం పింజోరాలో నలుగురు, ఆదివారం రెబన్‌లో ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే.