ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (09:15 IST)

క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల దుశ్చర్య.. స‌ర్పంచ్ హ‌త్య

క‌శ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఓ గ్రామ స‌ర్పంచ్ ని ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. ల‌ర్కిపొరా ప్రాంతంలోని లుక్బావ‌న్ గ్రామ స‌ర్పంచ్ అజ‌య్ పండిత భార‌తీ (40)ని సోమ‌వారం ఉగ్ర‌వాదులు హ‌త్య చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేత అయిన అజ‌య్ మృతిపై క‌శ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

టెరిబుల్ న్యూస్ అంటూ ఆమె త‌న త‌ల్లి ట్విట్ట‌ర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. అజ‌య్ పండిత హ‌త్య‌కు సంబంధించిన వార్త‌ను క‌మ‌ల్జిత్ సంధూ అనే జ‌ర్న‌లిస్ట్ చేసిన ట్వీట్ ను ఆమె రీట్వీట్ చేస్తూ.. ఆయ‌న కుటుంబానికి సానుభూతి తెలిపారామె.

క‌శ్మీర్ రాజ‌కీయ నేత‌లకు ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంద‌ని, ఉగ్ర‌వాద‌లకు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య న‌లిగిపోతున్నార‌ని అన్నారు ఇతిజా.