బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:58 IST)

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు తీవ్రవాదుల హతం

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటంలో తలమునకలై ఉంటే.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నాల్లో ఉందని ఇటీవల ఆర్మీ చీఫ్ నరవాణే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 
 
కశ్మీర్‌లో బుధవారం ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

దక్షిణ కశ్మీర్‌ సోఫియాన్ జిల్లా మెల్‌హెరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం రాత్రి అక్కడకు చేరుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ముష్కరులు సైన్యంపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమయిన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.

ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వీరంతా అన్సర్ ఘజావత్ ఉల్ హింద్ తీవ్రవాద సంస్థకు చెందినవారు. ఎన్‌కౌంటర్‌లో ఆ సంస్థ టాప్ కమాండర్ కూడా హతమయ్యాడు.