శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (08:39 IST)

విజయవంతంగా విక్రాంత్ సీ ట్రయల్స్‌

ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ విక్రాంత్ సీ ట్రయల్స్‌ విశాఖపట్నంలో ముగిశాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా సీ ట్రయల్స్‌ నిర్వహించి తిరుగు పయణమైంది.

కొచ్చి హిందూ మహాసముద్రంలో 4 రోజుల పాటు సీ ట్రయల్స్ జరగనున్నాయి. ఇండియన్ నేవీ గతంలో బేసిక్ ట్రయల్స్ నిర్వహించింది.

కాగా, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ విక్రాంత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణం చేపట్టే దేశాల సరసన భారత్ చేరింది.

2022 నాటికి విమాన వాహన నౌక అందుబాటులోకి రానుంది. రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌ ఏర్పాటు కానున్నా‍యి.