శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , శనివారం, 28 జనవరి 2017 (05:19 IST)

హోదా ఉద్యమాన్ని పందులతో పోల్చానా... అయితే క్షమించండి అన్న సుజనా చౌదరి

ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా చేపట్టిన నిరసనను ఉద్దేశించి అనరాని వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్న కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై నెటిజన్లు, ప్రజలు విరుచుకుపడటంతో మెట్టుదిగారు. హోదా ఉద్యమాన్ని తాను పందులతో పోల్చలేదని, ఇది దుష్ప్రచారమేనన

ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా చేపట్టిన నిరసనను ఉద్దేశించి అనరాని వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్న కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై నెటిజన్లు, ప్రజలు విరుచుకుపడటంతో మెట్టుదిగారు. హోదా ఉద్యమాన్ని తాను పందులతో పోల్చలేదని, ఇది దుష్ప్రచారమేనని అయినప్పటికీ ప్రజల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని సుజనా చెప్పారు. . 
 
జల్లికట్టు స్ఫూర్తితో ఉద్యమాలు చేయాలనుకొనేవారు కోళ్లు, పందుల పందేలు ఆడుకోవాలంటూ గురువారం ఢిల్లీలో సుజనా చౌజరి చేసిన వ్యాఖ్య ఆంధ్ర ప్రజలను మండించింది. సినీ రచయిత చిన్ని కృష్ణ హోదా ఉద్యమాన్ని పందులతో పోల్చినందుకు సుజనాను బండబూతులతో సత్కరించారు. సుజనా వ్యతిరేక వ్యాఖ్యలతో సోషల్ మీడియా చెలరేగిపోయింది. సుజనా వ్యాఖ్యలు పార్టీ పరువు తీసేయటంతో టీడీపీ నష్టనివారణకు దిగింది. రాష్ట్ర మంత్రి ఉమా మహేశ్వరరావు సుజనా అలా అనకూడదు. తప్పే అంటూ సర్ది చెప్పారు.  
 
ఈ నేపథ్యంలో అప్రతిష్ట పాలైన సుజనా చౌదరి తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఇతరుల మనోభావాలు దెబ్బతినివుంటే క్షమించాలని కోరారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తన వ్యాఖ్యల్లోని భావాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తాను పందులతో పోల్చలేదని, కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నారు. 
 
హోదా కంటే ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు వస్తాయన్నారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి 60 శాతం నిధులు మాత్రమే వస్తాయన్నారు. అయితే పోలవరం విషయంలో కేంద్రం వంద శాతం నిధులు మంజూరు చేయనుందని చెప్పారు.