సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (11:07 IST)

చంద్రబాబు పిటిషన్‌ను విచారించే సుప్రీం ధర్మాసనం ఇదే...

supreme court
తనపై అక్రమంగా నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసును కొట్టి వేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున దాఖలైన పిటిషన్‌పై మూడో తేదీ మంగళవాళం సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. 
 
ఈ క్వాష్ పిటిషన్‌పై గత వారమే విచారణ జరగాల్సి వుంది. అయితే, ద్విసభ్య ధర్మాసనంలోని తెలుగు న్యాయమూర్తి భట్టి తప్పుకోవడంతో ఈ పిటిషన్‌ను అక్టోబరు మూడో తేదీకి వాయిదా వేశారు. దీంతో మంగళవారం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
 
వరుసగా సెలవులు రావడంతో అక్టోబరు మూడో తేదీకి వాయిదావేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిటిషన్‌ను విచారించే బెంచ్‌ను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. మంగళవారం 6వ నెంబరు కోర్టులో విచారణ జరుగనుంది. చంద్రబాబు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ప్రత్యక్షంగా ఈ కేసులో హాజరై వాదనలు వినిపించనున్నారు.