తెలంగాణ పోలీస్ : మార్చి 12 మెయిన్ ఎగ్జామ్
తెలంగాణ పోలీస్ శాఖలో చేపట్టిన ఉద్యోగాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రిక్రూట్మెంట్‌లో భాగంగా, చివర అంకమైన మెయిన్స్ పరీక్షల తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. మార్చి 12వ తేదీ నుంచి మెయిన్ ఎగ్సామ్స్ నిర్వహించనుంది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షల నిర్వహిస్తారు.
ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోలీస్ పోస్టులకు ప్రధాన పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.
ప్రస్తుతం ఫిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. ఇవి ఈ నెల 5 తేదీతో ఈ దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. అయితే, హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌పై త్వరలోనే వెల్లడించనుంది.