గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (18:49 IST)

రూ. 12 కోట్ల‌తో సూర్యాపేట వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం అభివృద్ధి

సూర్యాపేట పట్టణంలోని ప్రసిద్ధ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులకు అంకురార్పణ చుట్టనున్నారు. 12 కోట్ల అంచనా వ్యయంతో విస్తరణ ,అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్.ఇ. మల్లికార్జున్ రెడ్డి అందుకు సంబంధించిన నమూనాలను సిద్ధం చేశారు. మంగళవారం తెలంగాణా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, యాదాద్రి ఆలయ శిల్పి ఆనందసాయి, స్థపతి వల్లియనాగన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ యస్ ఇ మల్లికార్జున్ రెడ్డి లతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణు ఆలయ ప్రాంగణంలో పరిశీల‌న జ‌రిపారు.

భూమి పూజ నిమిత్తం ఈ నెల 23 న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి రాకను పురస్కరించుకుని అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.